Matthew Hayden : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మాదే – పాక్ కోచ్

మాథ్యూ హేడ‌న్ షాకింగ్ కామెంట్స్

Matthew Hayden : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించ‌ని రీతిలో సౌతాఫ్రికాను నెద‌ర్లాండ్స్ ఓడించ‌డంతో మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా పాకిస్తాన్ అనూహ్యంగా సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. గ్రూప్ -బిలో భార‌త్, పాకిస్తాన్ చేరుకుంటే గ్రూప్ -ఎ లో న్యూజిలాండ్ , ఇంగ్లండ్ జ‌ట్లు సెమీ ఫైన‌ల్ కు చేరుకున్నాయి.

ఇక టోర్నీలో భాగంగా పాకిస్తాన్ న్యూజిలాండ్ తో ఆడ‌నుండ‌గా భార‌త్ , ఇంగ్లండ్ తో ఆడుతుంది. క్రికెట్ వ‌ర్గాలు మాత్రం చివ‌ర‌కు భార‌త్, పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంటాయ‌ని అంచ‌నా. అది ప‌క్క‌న పెడితే సోమ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు పాకిస్తాన్ హెడ్ కోచ్ మాథ్యూ హేడ‌న్(Matthew Hayden). టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని మిగ‌తా జ‌ట్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

త‌మ చేతిలో సెమీస్ లో కీవీస్ అప‌జ‌యం త‌ప్ప‌ద‌న్నాడు. ఇక ఫైన‌ల్ లో సైతం ఏ జ‌ట్టు వ‌చ్చినా గెలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు హేడ‌న్. బాబ‌ర్ ఆజ‌మ్ నేతృత్వంలోని త‌మ జ‌ట్టు అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నారు. తమ ముందున్నది ఒకే ఒక్క ల‌క్ష్య‌మ‌ని అది కేవ‌లం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ త‌మ జ‌ట్టు దుమ్ము రేపుతుంద‌న్నారు. ఒక‌వేళ భార‌త్ జ‌ట్టు వ‌చ్చినా లేదా ఇంగ్లండ్ జ‌ట్టు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు మాథ్యూ హేడ‌న్.

Also Read : దాయాదులు మ‌ళ్లీ త‌ల‌ప‌డ‌తారా

Leave A Reply

Your Email Id will not be published!