PAK Squad T20 World Cup : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ టీం డిక్లేర్

15 మందితో పాటు స్టాండ్ బై ప్లేయ‌ర్లు

PAK Squad T20 World Cup : వ‌చ్చే నెల అక్టోబ‌ర్ లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PAK Squad T20 World Cup)

జ‌ట్టును ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం విడుద‌ల చేసిన జాబితాలో కీల‌క ఆట‌గాళ్ల‌కు చోటు క‌ల్పించింది.

15 మంది జ‌ట్టు స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. వారితో పాటు ముగ్గురు స్టాండ్ బై ప్లేయ‌ర్ల‌కు ఛాన్స్ ఇచ్చింది. బాబ‌ర్ ఆజ‌మ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

వైస్ కెప్టెన్ గా షాదాబ్ ఖాన్ ను ఎంపిక చేసింది పీసీబీ. ఇదిలా ఉండ‌గా ఫాస్ట్ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ వ‌సీం జూనియ‌ర్ తో పాటు షాహీన్ అఫ్ర‌ది,

షాన్ మసూద్ ను ఎంపిక చేశారు సెలెక్ట‌ర్లు.

విచిత్రం షాన్ మ‌సూద్ ఈసారి జ‌ట్టులోకి కొత్త‌గా వ‌చ్చాడు. ఎంతో బ‌ల‌మైన జ‌ట్టుగా పేరొందిన పాకిస్తాన్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది శ్రీ‌లంక‌.

యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2022లో ఫైన‌ల్ కు చేరిన పాకిస్తాన్ ను మ‌ట్టి క‌రిపించింది.

అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటింది. ఇక ఆసియా క‌ప్ లో ఆశించిన రీతిలో రాణించ‌లేక పోయిన ఫ‌క‌ర్ జ‌మాన్ రిజ‌ర్వ్ ల జాబితాలోకి చేరి పోయాడు.

ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు ఏడు మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడేందుకు పాకిస్తాన్ లో కాలు మోపింది. ఇదే స‌మ‌యంలో ప్రపంచ క‌ప్ కంటే ముందు

పాకిస్తాన్  టీం బంగ్లాదేశ్ , న్యూజిలాండ్ తో అక్టోబ‌ర్ 7 నుంచి 14 వ‌ర‌కు క్రైస్ట్ చ‌ర్చ్ లో టి20 ట్రై సీరీస్ ఆడ‌నుంది.

ఇక జ‌ట్టు(PAK Squad T20 World Cup) ప‌రంగా చూస్తే. బాబ‌ర్ ఆజం కెప్టెన్, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్ , ఆసిఫ్ అలీ , హైద‌ర్ అలీ, హ‌రీస్ ర‌వూఫ్ , ఇఫ్తికార్

అహ్మ‌ద్ , ఖుష్టిల్ షా , హుస్సైన్ , న‌వాజ్ , రిజ్వాన్ , వ‌సీం జూనియ‌ర్ , న‌సీమ్ షా, మ‌సూద్ , ఉస్మాన్ ఖాదిర్ ఉన్నారు.

ఇక రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా ఫ‌క‌ర్ జ‌మాన్ , హ‌రీస్ , షాన‌వాజ్ ద‌హానీని ఎంపిక చేసింది పీసీబీ.

Also Read : ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ గా బౌచ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!