Hukum Jailer : తలైవా హుకుమ్ సెన్సేషన్
నిన్న కావాలా సూపర్ హిట్
Hukum Jailer : సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ ఇంకా పెరుగుతూనే ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా, తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి తాజాగా విడుదల చేసిన కావాలా సాంగ్ అన్ని రికార్డులను తిరగ రాస్తోంది. జోసెఫ్ విజయ్ నటించిన సాంగ్ ను కూడా దాటేసింది.
Hukum Jailer song
రజనీకాంత్ మాస్ అప్పీల్ ను పెంచేలా అద్భుతంగా క్రియేట్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. కావాలా తర్వాత మూవీ మేకర్స్ హుకుమ్ సింగిల్ సాంగ్(Hukum Song) ను రిలీజ్ చేశారు. ఇది కూడా హిట్ గా నిలిచింది. నటుడి వారసత్వానికి ప్రతీకగా దీనిని రూపొందించాడు మ్యూజిక్ డైరెక్టర్.
భిన్నమైన అంశాలను ఎంచుకుని సినిమాలలో నటించాడు రజనీకాంత్. కానీ బిగ్ హిట్ రాలేదు. తన కెరీర్ లో తన స్టామినా, ఇమేజ్ కు తగ్గట్టు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఈసారి జైలర్ లో మరింత ఆకట్టుకునేలా ప్రతి ఫ్రేమ్ ను తీర్చిదిద్దాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. కావాలాతో పోలిస్తే హుకుమ్ భిన్నమైన స్వరాన్ని కలిగి ఉంది. మొత్తంగా అనిరుధ్ చాలా కష్టపడ్డాడు రజనీ కోసం.
Also Read : Priya Prakash Varrier : పవర్ స్టార్ సింప్లీ సూపర్ – ప్రియా