Talasani Srinivas : ‘హైడ్రా’ కూల్చివేతలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తలసాని

పండుగల సమయంలో పేదలు సంతోషంగా లేకుండా చేస్తున్నారన్నారు...

Talasani Srinivas : హైడ్రాపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas) ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైడ్రా(HYDRA) అహింస పద్ధతి వీడకపోతే.. మేము మా స్టైల్‌లో వెళ్తాం’’ అని హెచ్చరించారు. బాధితుల ఏడుపు రేవంత్ రెడ్డికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. రేవంత్ నిర్ణయాలతో ఆయన కుటుంబ సభ్యులు కూడా మాటలు పడాల్సి వస్తుందన్నారు. ఇంతమందిని బాధపెట్టి రేవంత్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరణ పేరుతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

పండుగల సమయంలో పేదలు సంతోషంగా లేకుండా చేస్తున్నారన్నారు. ఇళ్ళు తొలగిస్తే ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు అక్కడ ఉండే అటాచ్‌మెంట్ ఎవ్వరు ఇవ్వలేరన్నారు. పేదల ఇళ్ళు తీయకుండా… ఉన్నదాంట్లో మూసీ సుందరికరణ చేస్తే ఎవ్వరికి ఇబ్బంది ఉండదని హితవుపలికారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో నాగోల్ ప్రాంతంలో అభివృద్ధి చేసి చూపించామని గుర్తుచేశారు. ప్రభుత్వం పెద్దలు మూసీ నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామంటున్నారని.. కానీ 700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా ఖాళీ లేవన్నారు. డబుల్ బెడ్ రూమ్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas) డిమాండ్ చేశారు.

Talasani Srinivas Slams…

హైడ్రాకు చట్టబద్ధతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రాకు చట్టబద్ధత వెనుక కేంద్రం ఉందని మాజీ మంత్రి కామంట్స్ చేశారు. బీజేపీ పెద్దల సూచనతోనే గవర్నర్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించారని అన్నారు. మూసీ బ్యూటిఫికేష్ కాదు.‌. పక్కా లూటిఫికేషన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లగాడు పిలిస్తే తెలంగాణకు ఉరికొస్తానన్న రాహుల్ గాంధీ.. ఏడ సచ్చిండు అంటూ ఘాటుగా స్పందించారు. మూసీ రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కాదు.‌. రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ అని సంచనల వ్యాఖ్యలు చేశారు. పేదలు చనిపోతుంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించారు.

మూసీ మూటలు మాత్రమే రాహుల్ గాంధీకి కావాలన్నారు. రబీ సీజన్ మెదలైనా.. రైతుబంధు ఇప్పటికీ లేదన్నారు. హామీలకు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్ కు నిధులెక్కడవని ప్రశ్నించారు. 16వేల కోట్లతో మెదలైన ప్రాజెక్ట్‌ను లక్షా 50వేలకు పెంచటం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. దమ్ముంటే పరిష్మన్ ఇచ్చిన వారిపై రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలను ఆక్రమణదారులు, దొంగలుగా చిత్రీకరించటం సరైంది కాదన్నారు. దొంగచాటుగా సర్వేలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. మూసీ ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి ఒరిగే లాభం ఏంటని అడిగారు. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయిందన్నారు. బిల్డర్ల తరుపున కాదు.. వారి కింద పనిచేసే కార్మికుల పక్షాన మాట్లాడుతున్నామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Also Read : TG High Court : యువతి మిస్సింగ్ కేసులో పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!