Talilor Killers Attacked : టైలర్ కిల్లర్స్ పై కోర్టు ఆవరణలో దాడి
అతి కష్టం మీద కస్టడీకి తీసుకెళ్లిన పోలీసులు
Talilor Killers Attacked : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ దర్జీ (టైలర్) దారుణ హత్య ఘటన. నిందితులు చంపేందుకు వాడిన కత్తులతో ఫోటోలు దిగారు.
ఆపై వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. అంతే కాదు దేశ ప్రధాని మోదీని కూడా చంపుతామని బెదిరించారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
పోలీసులను భారీగా మోహరించింది. ఆ ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆపై వారికి పాకిస్తాన్ లోని కరాచీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది కేంద్రం.
ఇందులో భాగంగా నిందితులను, సహకరించిన వారిని జైపూరు ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వారిని 10 రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా కోర్టు లోపటి నుంచి బయటకు తీసుకు వస్తుండగా లాయర్లు, అక్కడ గుమి కూడిన ప్రజలు పెద్ద ఎత్తున దాడికి(Talilor Killers Attacked) పాల్పడ్డారు. వారిని అతి కష్టం మీద పోలీసు వ్యానులోకి ఎక్కించారు.
ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రవక్త మహ్మద్ ను కించ పరిచేలా మాట్లాడిన నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకే టైలర్ ను చంపేశామంటూ ప్రకటించారు.
వారిపై దాడికి పాల్పడడంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంపిన వారిలో రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా తనకు ప్రాణ భయం ఉందంటూ కన్హయ్య లాల్ పోలీసులకు చెప్పినా పట్టించు కోలేదని మృతుడి తనయుడు యశ్ తేలి వాపోయారు.
ఆరోజే స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నాడు. అయినా వాళ్లను ఎన్ కౌంటర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.
Also Read : టైలర్ కిల్లర్స్ పై దాడికి యత్నం