Mayilsamy Died : తమిళ్ కమెడియన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Mayilsamy Died : తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఓ వైపు తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న శనివారం కన్ను మూశారు. ఆదివారం ఉదయం తమిళ సినీ రంగానికి చెందిన కమెడియన్ మయల్సామి(Mayilsamy Died) తుది శ్వాస విడిచారు. హాస్య పాత్రలకు ప్రసిద్ది చెందాడు. తమిళంలో మంచి పేరున్న హాస్య నటుడు. మయల్సామి 200 చిత్రాలకు పైగా నటించారు..జనాన్ని మెప్పించారు. ఇవాళ గుండె పోటుతో మృతి చెందారు. ఆయనకు 57 ఏళ్లు.
హాస్య నటుడు మయల్సామి నటించిన సినిమాలలో ధూల్ , వసీగరా, ఘిల్లి, గిరి, ఉత్తమపుతిరన్ , వీరమ్ , కాంచన, కంగలాల్ కైధు సెయి వంటి పేరొందిన ప్రముఖ సినిమాలలో హాస్య పాత్రలు పోషించారు.
ఉత్తమ హాస్య నటుడిగా తమిళనాడు ప్రభుత్వం అందించే రాష్ట్ర చలన చిత్ర అవార్డును పొందారు. ఆయన మరణ వార్త వినగానే ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. మయల్సామి మృతి పట్ల యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఆయన మృతికి సంతాపం తెలిపింది. ఎంతో వైవిధ్య భరితమైన పాత్రలలో నటించి మెప్పించిన ఘనత మయల్సామిదని పేర్కొన్నారు నటీ నటులు, టెక్నీషియన్లు. మయల్సామి(Mayilsamy Died) గ్లాస్ మాస్టెస్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా తమిళ సినీ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు సైతం సంతాపం ప్రకటించారు.
Also Read : తారకరత్న మరణం తీరని విషాదం