Tirumala Hundi : శ్రీవారి హుండీ చోరీకి పాల్పడిన తమిళనాడు వ్యక్తి
యువకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు...
Tirumala Hundi : తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనానికి వచ్చి పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వామివారి హుండీలో కొంత నగదును చోరీచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు.
Tirumala Hundi Theft..
యువకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. భద్రతా సిబ్బంది తమ ఆఫీస్‌లో అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఆ దొంగ నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగం అని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందినవాడని వివరించారు. అనంతరం టీటీడీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : AP Weather : తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు