Tamili Sai Soundarrajan : స్టాలిన్ కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే
తమిళి సై సౌందర రాజన్
Tamili Sai Soundarrajan : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను టార్గెట్ చేయడం కలకలం రేపింది. కేసీఆర్ కూడా స్టాలిన్ లాగే వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపించారు. కేసీఆర్ అనుసరిస్తున్న తీరు బాగో లేదని పేర్కొంది.
Tamili Sai Soundarrajan Comments on KCR and Stalin
ఆయన వ్యవహారం తనకు ఏమీ నచ్చడం లేదని కుండ బద్దలు కొట్టింది. నేను తేనీటి విందు ఇచ్చాను. ఇందుకు సంబంధించి ఇద్దరికీ ఆహ్వానం పంపాను. రమ్మని కోరాను. కానీ ఆ ఇద్దరు సీఎంలు రాక పోవడం దారుణమన్నారు తమిళి సై సౌందర రాజన్.
ఇదిలా ఉండగా రాజ్ భవన్ వేదికగా నిర్వహించిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎప్పటి లాగే వేడుకలు నిర్వహించడం జరుగుతూ వస్తోంది. ఈసారి తమిళి సైకి(Tamili Sai Soundarrajan) కోలుకోలేని షాక్ ఇవ్వడం కలకలం రేపింది. సామాన్యంగా గణతంత్ర వేడుకలకు, బతుకమ్మ సందర్బంగా గవర్నర్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడం వస్తోంది.
ఈ సందర్భంగా అందరికీ రావాలని ఆహ్వానం పంపించారు. కానీ ఎందుకనో ఈసారి రాలేదు. తాజాగా ఇద్దరు సీఎంలను లక్ష్యంగా చేసుకుని తమిళి సై సౌందర రాజన్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇరు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ తెలంగాణతో పాటు పాండిచ్చేరి రాష్ట్రానికి కూడా గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read : Jailer 400 Crore Club : జైలర్ రికార్డ్ రూ. 400 కోట్ల క్లబ్