Tamilisai KCR Comment : వివక్ష నిజం గవర్నర్ ధర్మాగ్రహం
తెలంగాణ సర్కార్ వర్సెస్ తమిళిసై
Tamilisai KCR Comment : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి చర్చకు దారి తీసింది గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్(Tamilisai Soundararajan) చేసిన కామెంట్స్. గత కొంత కాలం నుంచీ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య అంతరం పెరిగింది.
భారత రాజ్యాంగం ప్రకారం అటు సర్కార్ కు ఇటు రాజ్ భవన్ కు మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరిస్తూ వస్తారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఉద్యమం ఊపందుకుంది. ఇదే తరుణంలో రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా ఇరు రాష్ట్రాలకు
ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉంటూ వచ్చారు.
ఒకానొక సమయంలో ఆనాటి ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిపేందుకు ప్రయత్నం చేశారు. ఇరువురితో కలిసి సత్ సంబంధాలను నెలకొల్పే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత నరసింహన్ ను తప్పించింది కేంద్ర సర్కార్. తమ పార్టీకి చెందిన నిబద్దత కలిగిన నాయకురాలిగా పేరొందిన వైద్యురాలైన తమిళిసై
సౌందర రాజన్ ను గవర్నర్ గా నియమించింది.
మొదట్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై(Tamilisai KCR) బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయి, తెలంగాణ ఉద్యమ
సమయంలో మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద
ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఆయన పేరును సిఫారసు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి ప్రతిపక్షాలు. సమాజంలోని ఇతర వర్గాలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ సందర్భంగా ఫైల్ ను తిప్పి పంపింది గవర్నర్ తమిళిసై .
ఆనాటి నుంచి నేటి దాకా కేసీఆర్, తమిళిసై మధ్య ప్రచ్చన్న యుద్దం నడుస్తోంది. ఒక రకంగా ఆమె రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చేశారు. జవాబుదారీతనం లోపించడాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రజల కోసమే కానీ ప్రజా ప్రతినిధుల కోసం కాదని కుండ బద్దలు కొట్టారు. ఒక రకంగా గవర్నర్ పదవి అంటే మీరు చెప్పింది తలూపడం కాదని, సంతకం పెట్టడం కాదని స్పష్టం చేశారు.
కరోనా కష్ట కాలంలో ఆమె గవర్నర్ గా కంటే ఒక వైద్యురాలిగా స్పందించారు. తానే వెళ్లి పలకరించారు. ఓ వైపు బాధితులు పిట్టల్లా రాలి
పోతుంటే దొర వారు బయటకు రాలేదు.
తనయుడు పిట్ట కూతలకే పరిమితమై పోయారన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో మరొకరిని ఈ సందర్బంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.
భూ ఆక్రమణలు ఎదుర్కొని బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ను మెచ్చు కోకుండా ఉండలేం.
ఎందుకంటే ఏ ఒక్క మంత్రి బయట తిరగక పోయినా ఆయన రేయింబవళ్లు ఆస్పత్రులను సందర్శించారు. తన బాధ్యతను నిర్వర్తించారు. ఇదే
క్రమంలో ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు ఓ బాక్సు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ సీఎంకు రుచించ లేదు. యూనివర్శిటీలలో ఖాళీలు, టీచర్ల
భర్తీ, ఇతర అనేక సమస్యలపై ఆమె స్పందించారు.
ఇటీవల బాలికపై సామూహిక రేప్ కు గురైతే గవర్నర్ తనకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళిసై ఏదో చేయాలన్న తపనతో ప్రయత్నం చేస్తున్నారు.
ఆమెకు కనీసం ప్రోటోకాల్ పాటించక పోవడం వివాదాస్పదంగా మారింది. ఇవాళ మరోసారి గవర్నర్ తన గొంతును విప్పారు. రాష్ట్ర సర్కార్, అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానం పట్ల నిలదీశారు(Tamilisai KCR Comment).
తన పరిమితులు ఏమిటో తెలుసన్న ఆమె సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. తాను గవర్నర్ ను అయినా అడుగడుగునా అవమానాలేనని చెప్పడం విస్తు పోయేలా చేసింది.
ఏది ఏమైనా వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. రాష్ట్రానికి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గవర్నర్ కూడా అంతే ప్రధానం.
Also Read : అభివృద్ధి సూచికలో భారత్ అధ్వాన్నం