Tamilnadu: 1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం

1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం

Tamilnadu : తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. వాటిని 24 క్యారట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు తెలిపింది. తద్వారా ఏటా రూ.17.81 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడి ద్వారా వచ్చే వడ్డీని సంబంధిత ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం పేర్కొంది. హిందూ మత, దేవాదాయ శాఖకు (హెచ్‌ఆర్‌&సీఈ) సంబంధించిన ఓ విధానపర పత్రాన్ని మంత్రి శేఖర్‌ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఒకరు చొప్పున ముగ్గురు రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

Tamilnadu Govt

హిందూ భక్తులు దేవుడ్ని ఏదైనా కోరిక కోరుకోవటం… ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవటం పరిపాటి. కోరిక తీరగానే.. తాహతకు తగ్గట్టు కానుకలు ఇస్తూ ఉంటారు. వాటిలో బంగారు ఆభరణాలు కూడా ఉంటూ ఉంటాయి. భక్తులు కానుకగా ఇచ్చిన బంగారు అభరణాలను కొన్ని గుళ్లు బ్యాంకుల్లో పెట్టేస్తున్నాయి. మరి కొన్ని గుళ్లలో మాత్రం అవి ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉంటున్నాయి. అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారంతో అద్భుతం చేయడానికి తమిళనాడులోని కొన్ని గుళ్లు పూనుకున్నాయి.
తమిళనాడులోని 21 గుళ్లలో దాదాపు 10,74,123.488 గ్రాముల బంగారాన్ని సేకరించాయి. ఆ మొత్తాన్ని ముంబై తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ మింట్‌లో కరిగించాయి. కరిగించిన బంగారం ఆభరణాలను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బార్లుగా మార్చాయి. వాటిని భారతీయ స్టేట్ బ్యాంకులో గోల్డ్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ కింద డిపాజిట్ చేశాయి. తద్వారా వచ్చే ఆదాయాన్ని గుళ్ల అభివృద్దికి ఉపయోగించనున్నారు.తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మరిఅమ్మన్‌ ఆలయం నుంచి గరిష్ఠంగా 424 కేజీల బంగారం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read : Bhagavad Gita: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!