Tanvir Ahmed & Ramiz Raja : రమీజ్ రజాపై తన్వీర్ కన్నెర్ర
పీసీబీ చైర్మన్ గా ఏం చేశారో చెప్పండి
Tanvir Ahmed & Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజాపై నిప్పులు చెరిగాడు మాజీ పాకిస్తాన్ పేసర్ తన్వీర్ అహ్మద్(Tanvir Ahmed & Ramiz Raja). ఆయన చైర్మన్ గా అయ్యాక ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు బీసీసీఐ ఆదాయంలో దూసుకు పోతుంటే రమీజ్ రజా మాత్రం క్రికెట్ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయడం లేదని మండిపడ్డారు.
చైర్మన్ గా ఎంపికయ్యాక చాలా ఆశలు ఉండేవని కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయని వాపోయారు తన్వీర్ అహ్మద్. ఇప్పటి వరకు పీసీబీలో పేరుకు పోయిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
దేశ క్రికెట్ కోసం ఏ ఒక్క మంచి పనైనా ఉంటే చెప్పాలని , ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 59 ఏళ్ల రమీజ్ రజా వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
గతంలో ఉన్న పాలక వర్గం లాగానే వారి బాటలో నడుస్తున్నాడంటూ మండిపడ్డాడు. పాకిస్తాన్ జట్టు ఎంపిక , పీసీబీలో నియామకాలు ఇప్పటి వరకు మెరిట్ ఆధారంగా జరగలేదంటూ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశాడు.
రమీజ్ రజా పీసీబీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 9 నెలలు కావస్తోంది. చైర్మన్ గా ఎలాంటి పురోగతి సాధించ లేదని కన్నెర్ర చేశాడు.
తన్వీర్ అహ్మద్ తన స్వంత యూట్యూబ్ ఛానెల్ లో ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వం మారింది రమీజ్ రజా ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ కు శాపమేనని ఫైర్ అయ్యాడు.
Also Read : మిథాలీ రాజ్ లివింగ్ లెజెండ్ – మోదీ