TATA Chairman Meet : టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు

ఇక టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఉండనున్నారు...

TATA Chairman : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఇరువరు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఈ టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. ఇక టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఉండనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో విజన్ 2047 రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది.

TATA Chairman Meet..

ఇక విశాఖలో టీసీఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలికమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చర్చించారు.

Also Read : Fox Conn : హైదరాబాద్ లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘ఫాక్స్ కాన్’ చైర్మన్ లియూ

Leave A Reply

Your Email Id will not be published!