Tata Nano EV : టాటా క‌ల‌ల కారు మ‌ళ్లీ మార్కెట్ లోకి

పూర్తిగా విద్యుత్ ప‌రంగా న‌డిచేలా ప్లాన్

Tata Nano EV :  ప్ర‌తి సామాన్యుడు కారులో ప్ర‌యాణం చేయాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో దిగ్గ‌జ వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా ప్ర‌య‌త్నం చేశారు. అందులో భాగంగా రూపు దిద్దుకున్న‌దే నానో. దానిపై ఎన్నో అంచ‌నాలు ఉండేవి. కానీ ఆశించిన మేర అందుకోలేక పోయింది. దీనికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించారు ర‌త‌న్ టాటా.

ఆయ‌న ఒక్క‌సారి డిసైడ్ అయ్యారంటే దానిని స‌క్సెస్ చేసేంత దాకా వ‌దిలి పెట్ట‌రు. త‌క్కువ ధ‌ర‌లో, అన్ని సౌక‌ర్యాలు ఉండేలా డిజైన్ చేయించారు. దానికి అందంగా నానో అని పేరు పెట్టారు. ఇది ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్టు. ఇందులో భాగంగా 2008లో టాటా నానో కారును లాంచ్ చేశారు.

మొద‌ట్లో ఆ కారు సంచ‌ల‌నం సృష్టించింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాను రాను దానికి ఆద‌ర‌ణ త‌గ్గ‌డంతో పూర్తిగా నానో కార్ల త‌యారీని నిలిపి వేశారు టాటా. తాజాగా ఆయిల్ రేట్లు పెర‌గ‌డంతో జ‌నం త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే విద్యుత్ వాహ‌నాల‌ను ఎక్కువ‌గా ఇష్ట ప‌డుతున్నారు.

దీనిని గ‌మ‌నించిన ర‌త‌న్ టాటా. ఈ మేర‌కు మిగ‌తా కంపెనీల విద్యుత్ కార్లతో పోలిస్తే ధ‌ర త‌క్కువ ఉండేలా, నాణ్య‌త, సౌక‌ర్యాలు అందించేలా ప్లాన్ చేశారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే మార్కెట్ లోకి నానో విద్యుత్ కారు ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు టాక్. ప్ర‌స్తుతం వాహ‌న రంగానికి చెందిన మార్కెట్ లో ఈ వార్త జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనిని నిజం చేస్తూ నానో కార్ల‌ను(Tata Nano EV) ఎల‌క్ట్రిక్ వేరియంట్ లో తీసుకు వ‌స్తున్న‌ట్లు టాటా కంపెనీ ప్ర‌క‌టించింది. 2025 నాటిక‌ల్లా టాటా నానో ఈవీ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దీని ధ‌ర రూ. 2 నుంచి 3 లక్ష‌ల దాకా ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంది.

అంతే కాదు దీని స్పీడ్ 110 కిలోమీట‌ర్లుగా ఉండ‌వ‌చ్చ‌ని టాక్. కోయంబ‌త్తూర్ కు చెందిన జ‌యం అనే కంపెనీ ప్ర‌స్తుతం భార‌తీయ మార్కెట కోసం నానా ఎల‌క్ట్రిక్ వెర్ష‌న్ పై ప‌ని చేస్తోంది. హైద‌రాబాద్ లోని ఓలాకు 400 కార్లను ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. మొత్తంగా రాబోయే టాటా ఎల‌క్ట్రిక‌ల్ నానో కారుపై ఉత్కంఠ నెల‌కొంది. స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం.

Also Read : హైద‌రాబాద్ లో జ‌పాన్ కంపెనీ పెట్టుబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!