TATA Merge Airlines : నాలుగు ఎయిర్ లైన్స్ లు ఒకే గూటికి

ఆలోచిస్తున్న టాటా ఎయిర్ ఇండియా

TATA Merge Airlines : టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త‌న‌కు చెందిన నాలుగు ఎయిర్ లైన్స్ ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకు రావాల‌ని అనుకుంటోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ లేదు.

కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎయిర్ ఇండియా మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా ఈ చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు టాక్. దేశంలోని సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ కు చెందిన విస్తారా బ్రాండ్ ను ర‌ద్దు చేయాల‌ని కూడా అనుకుంటోంది. ఎయిర్ ఇండియా త‌న కొత్త య‌జ‌మాని టాటా గ్రూప్ ఆధ్వ‌ర్యంలో పున‌రుద్ద‌ర‌ణ‌కు సిద్దం అవుతోంది.

విశాల‌మైన కంపెనీ త‌న వైమానిక రాజ్యాన్ని పున‌ర్ నిర్మించేందుకు సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం దీని గురించే విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని టాక్. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ కంబైన్డ్ ఎంటీటీలో తీసుకోవాల్సిన వాటా ప‌రిణామాన్ని అంచ‌నా వేస్తున్న‌ట్లు ఎయిర్ ఇండియాకు చెందిన ఒక‌రు తెలిపారు.

అయితే సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ మాత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఐఏ , టాటా మ‌ధ్య చ‌ర్చ‌లు(TATA Merge Airlines) కొన‌సాగుతున్నాయ‌ని వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 13 ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ కు మించి జోడించానికి ఏమీ లేద‌ని పేర్కొంది. ఇందులో భాగంగా విస్తారా కూడా ఇందులో భాగం కానుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

పూర్తి సేవ క్యారియ‌ర్ 300 నారా బాడీ జెట్ ల‌ను ఆర్డ‌ర్ చేసేందుకు కూడా ఎయిర్ ఇండియా గ్రూప్ ప‌రిశీలిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దీంతో నాలుగు ఎయిర్ లైన్స్ లు ఒకే గూటికి రానున్నాయి.

Also Read : సావ‌ర్క‌ర్ దేశ ద్రోహి..రాహుల్ పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!