TCS: టీసీఎస్‌లో 12వేల ఉద్యోగాల కోత ?

టీసీఎస్‌లో 12వేల ఉద్యోగాల కోత ?

TCS : దేశంలో ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌(TCS) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు ఆ సంస్థ సీఈవో కె.కృతివాసన్‌ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 12 వేలకు పైగా ఉద్యోగాల కోత నిర్ణయంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మొత్తం పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని, టెక్‌ కంపెనీతో టచ్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

TCS Layoffs Sensational

ఉపాధిలో వృద్ధి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాధాన్యంగా ఉందని, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం(ELI) వంటి కార్యక్రమాలతో ఉద్యోగావకాశాలను ఎలా పెంచవచ్చనే అంశంపైనా దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో, నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఐటీ మంత్రిత్వశాఖ గమనిస్తోందని, టెక్‌ సంస్థ టీసీఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు లోతుగా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టీసీఎస్‌ సీఈఓ కె.కృతివాసన్‌ వెల్లడించారు. అంతర్జాతీయ అనిశ్చితులు, కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ మార్పుల కారణంగానే ఈ తొలగింపులు చేయాల్సి వస్తున్నట్లు తెలిపారు. ‘భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే ప్రయాణంలో సంస్థ ఉంది. ఇందుకోసం సిబ్బందికి నూతన సాంకేతికతల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రత్యామ్నాయం కల్పించలేని పరిస్థితుల్లోనే కొంత మందిని తొలగించాలని నిర్ణయించాం. 6,13,069 మంది ఉద్యోగుల్లో వీరు 2 శాతానికి సమానం. మధ్య, సీనియర్‌ స్థాయి మేనేజర్లపై ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది’ అని ఒక అధికార ప్రకటనలో టీసీఎస్‌ పేర్కొంది.

Also Read : Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహాదేవ్‌’! ముగ్గురు ఉగ్రవాదుల హతం !

Leave A Reply

Your Email Id will not be published!