TDP 2nd List: టీడీపీ రెండో జాబితా విడుదల !

టీడీపీ రెండో జాబితా విడుదల !

TDP 2nd List: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ… తమ అభ్యర్ధులపై తీవ్ర కసరత్తు చేస్తుంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్ధులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ… గురువారం మరో 34 మందితో రెండో జాబితాను ప్రకటించింది. ఈ మేరకు 34 మందితో కూడిన రెండో జాబితాను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. రానున్న ఎన్నికల్లో బీజేపి, జనసేనతో కలిసి పోటీచేయడానికి పొత్తును ఖరారు చేసుకున్న టీడీపీ(TDP)… ఇప్పటికే బీజేపీకు 10, జనసేనకు 21 స్థానాలను కేటాయించింది. మిగిలిన 144 స్థానాలకు గాను ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా… తాజాగా 34 మందితో రెండో జాబితాను వెల్లడించింది. దీనితో మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

TDP 2nd List – రెండో జాబితాతో సీట్లు పొందిన అభ్యర్థులు వీరే !

1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు

2. రంప చోడవరం – మిర్యాల శిరీష

3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

4. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్

6. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజీర్

7. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

8. గిద్దలూర్-అశోక్ రెడ్డి

9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్

10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

14. కొవ్వూరు(రాజమండ్రి)-ముప్పిడి వెంకటేశ్వరరావు

15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

16. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి

17. నందికొట్కూర్- గిత్తా జయసూర్య

18. కదిరి-కందికుంట యశోదా దేవి

19. మాడుగుల-ఫైలా ప్రసాద్

20. కందుకూర్ – ఇంటూరి నాగేశ్వరరావు

21. మదనపల్లి-షాజహాన్ భాషా

22. రామచంద్రపురం- వాసంశెట్టి సుభాష్

23. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి

24. వెంకటగిరి- కురుగొండ్ల లక్ష్మిప్రియ

25. కమలాపురం- పుత్తా చైతన్య రెడ్డి

26. ప్రొద్దుటూరు-వరదరాజుల రెడ్డి

27. ఎమ్మిగనూరు-జయనాగేశ్వర రెడ్డి

28. మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి

29. పుట్టపర్తి-పల్లె సింధూరా రెడ్డి

30. పుంగనూరు-చల్లా రామ చంద్రారెడ్డి(బాబు)

31. చంద్రగిరి- పులివర్తి వెంకట మణిప్రసాద్(నాని)

32. శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

33. సత్యవేడు-కోనేటి ఆదిమూలం

34. పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

Also Read : Amit Shah : సిఏఏ అంశంపై ఎవరికి భయపడబోమని ఘాటు వ్యాఖ్యలు చేసిన షా

Leave A Reply

Your Email Id will not be published!