Kolikapudi Srinivas: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ పై టీడీపీ హై కమాండ్ సీరియస్

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ పై టీడీపీ హై కమాండ్ సీరియస్

Kolikapudi Srinivas : గిరిజన మహిళను వేధించనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటలంలొ పార్టీ చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం‌పై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎమ్మెల్యే కొలికపూడిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో విషయం తెరపైకి రావడంతో… ఈ ఘటనపై హైకమాండ్ నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

Kolikapudi Srinivas got Warning

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో(Kolikapudi Srinivas) ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కో ఆర్డినేటర్, విజయవాడ ఎంపీ, మరో ముగ్గురిని కలిపి అధిష్ఠానం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో పాటు గత 10 నెలల నుంచి జరిగిన సంఘటనలపై కూడా నివేదికలో పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు శుక్రవారం రాత్రికి పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికే అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయంతో 48 గంటల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నివేదిక ఇవ్వాలని పార్టీ నాయకులను ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొలికపూడి విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కొలికపూడి ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read : CM Chandrababu Naidu: ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది – ఏపీ సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!