TDP Janasena First List: టీడీపీ, జనసేన కూటమిల మొదటి జాబితా విడుదల !

టీడీపీ, జనసేన కూటమిల మొదటి జాబితా విడుదల !

TDP Janasena First List: టీడీపీ,జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మొదటి జాబితాను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఎట్టకేలకు విడుదల చేసారు. టీడీపీ(TDP), జనసేనల మొదటి జాబితాలో జనసేన నుండి ఐదు స్థానాలను ప్రకటించగా… టీడీపీ(TDP) నుండి 94 స్థానాలను ప్రకటించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ జాబితాను విడుదల చేసారు. జనసేన పార్టీ మొత్తంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే మొదటి జాబితాలో ఐదు అసెంబ్లీ స్థానాల పేర్లు మాత్రమే ప్రకటించి… మిగిలిన స్థానాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని స్పష్టం చేసారు. తమ కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే అందుకు అనుగుణంగా సీట్లు సర్దుబాటు చేసుకునే విషయంపైనా అవగాహన వచ్చినట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జనసేన(Janasena) పిఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్, జనసేన నేత నాగబాబు పాల్గొన్నారు.

TDP Janasena First List – జనసేన తరపున పవన్ కల్యాణ్ ప్రకటించిన 5 గురు అభ్యర్థులు :

తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
రాజానగరం- బత్తుల బాలకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
అనకాపల్లి – కొణతల రామకృష్ణ

టీడీపీ తరుపున చంద్రబాబు ప్రకటించిన 94 అభ్యర్థులు:

ఇచ్చాపురం-బెందాలం అశోక్
టెక్కలి-అచ్చెన్నాయుడు
ఆముదాలవలస – కూన రవికుమార్
రాజాం- కోండ్రు మురళి
కురుపాం – టి.జగదీశ్వరి
పార్వతీపురం- విజయ్ బోనెలచంద్ర
సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి- బేబి నయన
గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం- అథితి గజపతిరాజు
విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ
విశాఖ వెస్ట్ –గణబాబు
అరకు- దొన్నుదొర
పాయకరావుపేట – వంగలపూడి అనిత
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

తుని- యనమల దివ్య
పెద్దాపురం- చినరాజప్ప
అనపర్తి- నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ముమ్మడివరం- దాట్ల సుబ్బరాజు
గన్నవరం(ఎస్సీ)- మహాసేన రాజేశ్
కొత్తపేట- బండారు సత్యానందరావు
మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
ఆచంట- పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి- మంతెన రామరాజు
తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు- బడేటి రాధాకృష్ణ

 

చింతలపూడి(ఎస్సీ)- సొంగా రోహన్
తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్
నూజివీడు- కొలుసు పార్థసారథి
గన్నవరం- యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ- వెనిగండ్ల రాము
పెడన- కాగిత కృష్ణప్రసాద్
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
పామర్రు- వర్ల కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్- బోండా ఉమ
విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు
నందిగామ- తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట- శ్రీరామ్ తాతయ్య
తాడికొండ- తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి- నారా లోకేశ్
పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
వేమూరు- నక్కా ఆనంద్ బాబు
రేపల్లె-అనగాని సత్యప్రసాద్
బాపట్ల- నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు- బూర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ- జీవీ ఆంజనేయులు
మాచర్ల- జూలకంటి బ్రహ్మానందరెడ్డి
యర్రగొండపాలెం- గూడూరి ఎరిక్షన్ బాబు
పర్చూరు- ఏలూరు సాంబశివరావు
అద్దంకి-గొట్టిపాటి రవి
సంతనూతలపాడు- బీఎన్ విజయ్ కుమార్
ఒంగోలు- దామచర్ల జనార్థన్
కొండేపి- డోలబాల వీరాంజనేయస్వామి
కనిగిరి- ఉగ్ర నరసింహారెడ్డి
కావలి- కావ్య కృష్ణారెడ్డి

 

నెల్లూరు సిటీ- పి.నారాయణ
నెల్లూరు రూరల్ –కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి
గూడూరు- పాశం సునీల్
సూళ్లూరుపేట –నెలవెల విజయశ్రీ
ఉదయగిరి- కాకర్ల సురేష్
కడప- మాదవిరెడ్డి
రాయచోటి- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
పులివెందుల- బీటెక్ రవి
మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు- టీజీ భరత్
పాణ్యం- గౌరు చరితారెడ్డి
నంద్యాల- ఎన్ఎమ్‌డీ ఫరూక్
బనగానపల్లి – బీసీ జనార్థన్ రెడ్డి
డోన్- కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
పత్తికొండ- కేఈ శ్యామ్ బాబు
కోడుమూరు- బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
ఉరకొండ- పయ్యావుల కేశవ్
తాడిపత్రి –జేసీ అస్మిత్ రెడ్డి
సింగనమల- బండారు శ్రావణి
కల్యాణదుర్గం- అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు- పరిటాల సునీత
మడకశిర- ఎమ్ఈ సునీల్ కుమార్
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పెనుకొండ- సవితా
తంబాళపల్లి- జయచంద్రారెడ్డి
పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
నగరి- గాలి బానుప్రకాశ్ రెడ్డి
జీడీ నెల్లూరు- వీఎమ్ థామస్
చిత్తూరు- గురజాల జగన్మోహన్
పలమనేరు- అమర్నాథ్ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

Also Read : Janasena 1st List : జనసేన ఎమ్మెల్యేల తొలి జాబితా..ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనసైనికులు

Leave A Reply

Your Email Id will not be published!