AP MLC Elections : పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపు
పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి షాక్
AP MLC Elections : ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీకి షాక్ తగిలింది. ఇది ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేకతను తెలియ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందినా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం విస్తు పోయేలా చేసింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపొందారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో(AP MLC Elections) టీడీపికి ప్రయారిటీ లభిస్తే రెండో ప్రాధాన్యత కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు ఆధిక్యం రావడం విస్తు పోయేలా చేసింది. టీడీపీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగి పోయారు. ఇక కంచర్ల శ్రీకాంత్ కు 1,12,686 ఓట్లు సాధించగా శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి దాకి ఓట్ల లెక్కింపు జరిగింది. ఉత్తరాంధ్రలో సైతం విజయం దక్కడం జరిగింది. 90 శాతం తొలి ప్రాధాన్యతలోనే చిరంజీవిరావు గెలుపొందారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ చిరంజీవి రావుకు వచ్చిన ఆధిక్యతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ కు నివేదించారు.
అనంతరం అక్కడి నుంచి అనుమతి రావడంతో చిరంజీవి రావును విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ అంతటా విజయోత్సవ సంబురాలు కొనసాగుతున్నాయి.
Also Read : ఏపీ విద్యార్థులకు మోదీ అభినందన