TDP Vs YSRCP War : ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతికి గుడివాడలో టీడీపీ వెర్సెస్ వైసీపీ నువ్వా.. నేనా అంటూ సభలు

తారాస్థాయికి చేరిన టీడీపీ వైసీపీ వార్

TDP Vs YSRCP War : టీడీపీ, వైసీపీలు వర్గాలు గుడివాడ సెంటర్‌లో సై అంటే సై అంటున్నాయి. నువ్వా.. నేనా.. అన్నట్టుగా తలపడతున్నారు ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కోడాలిని టీడీపీ టార్గెట్ చేస్తే.. కోడాలి పోరుకు దిగి నేను ఎం తక్కువ అన్నట్టు మండిపడ్డారు. ఇంకా చెప్పాలంటే గుడివాడలో పొలిటికల్ గేజ్ 1000 వాట్లకు పైగా వేడితో ఉంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కొడాలి నాని పోటీ పడడంతో గుడివాడలో ఉత్కంఠ పెరిగింది.

TDP Vs YSRCP War Viral in Gudivada

చంద్రబాబు ‘రా కదలిరా’ అంటూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. కొడాలి నాని పోటీగా ఎన్టీఆర్(NTR) వర్ధంతిపై ర్యాలీ నిర్వహించారు. కోడాలి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో గుడివాడలో ఒక్కసారిగా రాజకీయం మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కింది. గుడివాడలో ఒకే రోజు, ఒకే సమయంలో పోటా పోటీ సదస్సు నిర్వహించి నట్టు పీక్స్ కి చేరుకుంది. గుడివాడ నగరంలో టీడీపీ, వైసీపీకి చెందిన ఫ్లెక్సీలు చాలా ఉన్నాయి. ఎటు చుసినా ఒకరి మీద ఒకరు పోటా పోటీగా బ్యానెర్లు ఏర్పాటు చేసారు.

Also Read : NTR Jayanti : కుటుంబీకులు.. అభిమానులు..రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

Leave A Reply

Your Email Id will not be published!