ICC Rankings India No 1 : మూడు ఫార్మాట్ లలో ఇండియా టాప్
ఐసీసీ ర్యాంకింగ్స్ లలో నెంబర్ వన్
ICC Rankings India No 1 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన చరిత్ర సృష్టించింది భారత క్రికెట్ జట్టు. క్రికెట్ లోని ప్రధాన ఫార్మాట్ లైన టెస్టు, వన్డే, పొట్టి టి20 ఫార్మాట్ లలో టాప్ లో నిలిచింది. దుమ్ము రేపింది.
ఇది అరుదైన రికార్డ్ . తగ్గేదే లేదంటూ రోహిత్ సేన నిలిచింది. ఫిబ్రవరి 15, 2023 చిరస్థాయిగా నిలిచి పోయేలా మూడు ఫార్మాట్ లలో నెంబర్ 1 గా అవతరించింది. విచిత్రం ఏమిటంటే మూడు విభాగాలలో సైతం భారత జట్టుకు చెందిన ప్లేయర్లు టాప్ లో నిలిచారు. భారత్ లో ఆస్ట్రేలియా పర్యటిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
సీరీస్ లో భాగంగా తొలి టెస్టు నాగ్ పూర్ లో జరిగింది. ఇన్నింగ్స్ తేడాతో ఆసిస్ ను ఓడించింది. దాంతో ఇప్పటి దాకా టెస్టు విభాగానికి సంబంధించి టాప్ ర్యాంక్ లో ఉన్న ఆస్ట్రేలియా ను దాటేసింది భారత్ నెంబర్ 1 గా(ICC Rankings India No 1) నిలిచింది.
ఇదే సమయంలో ఇప్పటికే వన్డే లోనూ టి20 ఫార్మాట్ లోనూ రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు టాప్ లో నిలవడం ..మూడు ఫార్మాట్ లలో అగ్ర భాగాన ఉండడం విస్తు పోయేలా చేసింది. ఒక రకంగా భారత జట్టుకు ఇది శుభశూచకం అని చెప్పక తప్పదు. ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు జరగాల్సి ఉంది.
తాజాగా ఐసీసీ ప్రకటించిన రేటింగ్స్ చూస్తే 115 పాయింట్లతో నెం 1లో ఉండగా ఆసిస్ 111 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ మూడో స్థానంతో సరి పెట్టుకుంది.
ఇక జట్టుకు సంబంధించిన ఆటగాళ్ల పరంగా చూస్తే వన్డే ఫార్మాట్ లో బౌలింగ్ లో సిరాజ్ నెంబర్ 1న లో ఉన్నాడు. టీ20లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. మరో భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెంబర్ 1న లో కొనసాగుతున్నాడు.
Also Read : భారత్ విండీస్ బిగ్ ఫైట్