INDW vs WIW : భారత మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రమేష్ పొవార్ చేసిన కామెంట్స్ కు తగ్గేదే లే అంటూ దుమ్ము రేపారు అమ్మాయిలు. సీనియర్లు ఆడక పోతే జట్టు పరిస్థితి కష్టమని వ్యాఖ్యానించడంతో తమ సత్తా ఏమిటో రుచి చూపించారు.
తాజాగా ఇవాళ కీవీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ (INDW vs WIW )లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపారు. ఏకంగా 317 పరుగుల భారీ స్కోర్ సాధించారు. ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ ముందుంచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా స్కిప్పర్ మిథాలీ రాజ్. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 123 పరుగులు చేసి సత్తా చాటింది.
ఇక వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 109 పరుగులు చేసి విండీస్ బౌలర్ల భరతం పట్టారు. భారీ స్కోర్ చేయడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరితో పాటు యస్తికా భాటియా 31 పరుగులు చేస్తే పూజా వస్త్రాకర్ 10 పరుగులు చేసి వెనుదిరిగారు.
ఇక షమీలియా బౌలింగ్ లో సెల్మాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటైంది స్మృతి మంధాన. హేలీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి సెంచరీ చేసింది. ఇక కెప్టెన్ మిథాలీరాజ్ మరోసారి నిరాశ పర్చింది.
ఆమె కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకుంది. ఇక ఈ టోర్నీనే రాజ్ కు లాస్ట్. ఆ తర్వాత క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : భారత్ పై కీవీస్ ఘన విజయం