Rohit Sharma : ఐపీఎల్ మెగా వేలంలో 204 మంది ఆటగాళ్ల పంట పండింది. ఇందులో భారత జట్టుకు ఆడుతున్న వాళ్లు. కొందరు ఆటగాళ్లు ఏకంగా రూ. 2 కోట్ల నుంచి 15 కోట్ల దాకా దక్కించుకున్నారు.
మరికొందరు స్టార్లను పట్టించు కోలేదు. ఎక్కువ మంది ప్లేయర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma). కోట్లు, ఐపీఎల్ తమకు ముఖ్యం కాదన్నాడు.
ముందు భారత జట్టు విజయం సాధించడంపై ఫోకస్ పెట్టాలని హెచ్చరించారు. లేక పోతే ఒప్పుకోనని స్పష్టం చేశాడు హిట్ మ్యాన్. అయితే కొందరు ఒక్క రోజులో కరోడ్ పతులు అయ్యారు. మరికొందరు అమ్ముడు పోలేదు.
దీంతో భావోద్వేగాలకు లోను కావద్దని సూచించాడు రోహిత్ శర్మ. ఆ ప్రభావం జాతీయ జట్టుపై అధికంగా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐపీఎల్ కంటే భారత జట్టు ముఖ్యమన్న భావనతో ఆడాలని సూచించాడు.
ఏ జట్టుకు ఆడుతున్నారు. ఏ ప్లేస్ లో ఆడబోతున్నారనే దానిని పక్కన పెట్టాలన్నాడు. జట్టు ప్రయోజనాలే ప్రామాణికం కావాలన్నాడు. ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు అక్కడి రూల్స్ వేరుగా ఉంటాయన్నాడు.
కానీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు విండీస్ పై గెలిచేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశాడు. వన్డే ఆట తీరు వేరుగా ఉంటుంది. టీ20 ఫార్మాట్ టైమింగ్ వేరుగా ఉంటుంది.
వీటిని ముందుగా గుర్తుంచు కోవాలని ఆటగాళ్లకు సూచించాడు. రాబోయే ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని జట్టులో కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు.
Also Read : ‘కీగన్ ..నైట్’ ప్లేయర్ ఆఫ్ ది మంత్