Team India Loss Comment : క‌ల చెదిరింది క‌థ మారింది

కోట్లాది ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు

Team India Loss Comment : ఆస్ట్రేలియా వేదిక నుంచి భార‌త జ‌ట్టు(Team India Loss) నిష్క్ర‌మించింది. ఒక ర‌కంగా ఇది కోలుకోలేని దెబ్బ‌. గ‌త ఏడాది 2021లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టుతో ఆడిన మ్యాచ్ ను త‌ల‌పింప చేసింది గురువారం అడిలైడ్ ఓవెల్ లో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్. ఇక్క‌డ జ‌ట్లు వేరు. లీగ్ వేరు అంతే.

క‌మాన్ ఇండియా అన్న నినాదాలతో , పూజ‌ల‌తో దేశ‌మంతా , ప్ర‌పంచ‌మంతా భార‌తీయులు ఊగి పోయారు. కానీ దాయాది పాకిస్తాన్ దెబ్బ‌కు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓట‌మి మూట‌గ‌ట్టుకున్నారు. టోర్నీ నుంచి నిష్క్ర‌మించారు. ఆనాటి వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఆస్ట్రేలియా ఎగ‌రేసుకు పోయింది.

కానీ ఇవాళ ఇంగ్లండ్ కొట్టిన దెబ్బ ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. ప్ర‌ధానంగా భార‌త జ‌ట్టు కంటే క్రికెట్ ను మ‌తం కంటే, దేవుళ్ల కంటే ఎక్కువ‌గా అభిమానించే అభిమానుల‌కు, క్రికెట్ ల‌వ‌ర్స్ కు. ఈ ఓట‌మిని తేలిక‌గా తీసుకోవ‌డానికి వీలు లేదు. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు చెప్పి మ‌రీ ఉతికి పారేయ‌డం విస్తు పోయేలా చేసింది.

సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కంటే ముందు ఇంగ్లండ్ స్టార్ హిట్ట‌ర్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కీల‌క ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ ఒక‌టే చెప్పాడు. ఒక్క స్టార్ హిట్ట‌ర్ సూర్య

కుమార్ యాద‌వ్ ను తాము త‌ప్పించ గ‌లిగితే మ్యాచ్ మా చేతుల్లోకి వ‌చ్చిన‌ట్టేన‌ని ప్ర‌క‌టించాడు. ఒక ర‌కంగా మాన‌సికంగా దెబ్బ కొట్టాడు.

అంతే కాదు మ‌న జ‌ట్టుకంటే అవ‌త‌లి జ‌ట్టును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాలి..ప్ర‌శంసించాలి కూడా. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. అద్భుత‌మైన జ‌ట్టుగా కొనియాడుతూ వ‌స్తున్న టీమిండియా ఎందుక‌ని సెమీస్ లో చ‌తికిల ప‌డిందో(Team India Loss) ఆలోచించు కోవాలి. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు భార‌త జ‌ట్టు ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

అంతా అయి పోయాక ఓటమి పొందాక ఏడిస్తే ఏం లాభం. హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ మెత‌క వైఖ‌రి, ఆట‌గాళ్ల నిర్ల‌క్ష్యం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. అదృష్టం త‌లుపు త‌ట్టి సెమీస్ కు ఎంట‌రై..ఏకంగా కీవీస్ కు షాక్ ఇచ్చి ఫైన‌ల్ కు చేరారు.

ఆ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ఒక‌టే మాట‌న్నాడు. ఏ జ‌ట్టు వ‌చ్చినా క‌ప్ మాదేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. ప్ర‌ధానంగా ఆడాల్సిన స‌మ‌యంలో కేఎల్

రాహుల్ , కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్ ఇలా పెవిలియ‌న్ దారి ప‌డితే ఏం చేస్తాం.

ఇక‌నైనా భారత ఆట‌గాళ్లు మారాలి. ప్రొఫెష‌న‌ల్ గా ఉండేలా త‌మ‌ను తాము మార్చు కోవాలి. ఎవ‌రు ఆడినా ముందు భార‌తీయ ప‌తాకం గుర్తుకు రావాలి.

135 కోట్ల ప్ర‌జ‌ల త‌ర‌పున ఆడుతున్నామ‌న్న సోయి ఉండాలి. లేక పోతే ఇలాంటి మ్యాచ్ లు ఎన్నో కోల్పోవాల్సి వ‌స్తుంది.

మొత్తంగా కోట్లాది రూపాయ‌ల బెట్టింగ్ రాయుళ్లు, దాయాదుల పోరు కొన‌సాగుతుంద‌ని ఆశించిన కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లకు ఒక ర‌కంగా

ఇది షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా భార‌త జ‌ట్టు ఓడి పోవ‌డం యాధృశ్చికం అనుకోవ‌డానికి వీలు లేదు.

Also Read : చెప్పారు ఇండియాను చిత‌క్కొట్టారు

Leave A Reply

Your Email Id will not be published!