Team India : ఐర్లాండ్ కు చేరుకున్న భారత్
మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్
Team India : బీసీసీఐ(BCCI) ఇప్పటి వరకు నలుగురు కెప్టెన్లను మార్చింది. విండీస్ టూర్ కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. ఆసియా కప్ కు రుతురాజ్ గైక్వాడ్ ను, వరల్డ్ కప్ కు రోహిత్ శర్మను నియమించింది. తాజాగా ఐర్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సీరీస్ కు ఇటీవలే గాయపడి ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను స్కిప్పర్ గా ఎంపిక చేసింది.
Team India Reached Ireland
ఎన్ని మార్పులు చేసినా భారత జట్టు ఆటగాళ్ల ఆట తీరు మారడం లేదు. ఆగస్టు 18న తొలి టి20 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే డబ్లిన్ కు చేరుకున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ లో మునిగి పోయారు. ఆగస్టు 23తో సీరీస్ ముగుస్తుంది. విండీస్ టూర్ లో పాండ్యా సారథ్యంలోని టీమిండియా సీరీస్ పోగొట్టుకుంది. వైస్ కెప్టెన్ గా రుతురాజ్ కు ఛాన్స్ ఇచ్చింది.
ఇక జట్ల పరంగా చూస్తే టీమిండియా కు బుమ్రా కెప్టెన్. గైక్వాడ్ , యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ, రింకూ సింగ్ , వాషింగ్టన్ సుందర్ , శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్ , సంజూ శాంసన్ , జితేష్ శర్మ, రవి బిష్ణోయ్ , ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్ , ముఖేష్ కుమార్ , అవేష్ కుమార్ ఆడతారు.
ఇక ఐర్లాండ్ జట్టు పరంగా చూస్తే పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ కాగా , ఆండ్రూ బిల్బిర్నీ, రాస్ అడైర్ , హ్యారీ , డెలానీ, కాంఫర్ , డాక్రెల్ , హ్యాండ్ , లోర్కాన్ టక్కర్ , మార్క్ అడైర్ , జాషువా లిటిల్ , బారీ మెక్ కార్తీ, థియో , వాన్ కోమ్ వైట్ , క్రెయిగ్ యంగ్ ఆడతారు.
Also Read : Tellam Venktarao : పొంగులేటికి షాక్ ‘తెల్లం’ జంప్