Balakrishna Landing : బాల‌య్య హెలికాప్ట‌ర్ లో సాంకేతిక లోపం

రోడ్డు మార్గం ద్వారా ప్ర‌యాణించే ఛాన్స్

Balakrishna Landing : ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ లో సాంకేతిక లోపం త‌లెత్తింది. ముందుగానే పైల‌ట్ ఈ లోపాన్ని గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ హెలికాప్ట‌ర్ లో బాల‌కృష్ణ‌, టీం వీర సింహారెడ్డి సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా శుక్ర‌వారం ఒంగోలుకు వెళ్లారు.

తిరుగు ప్ర‌యాణంలో ఉండ‌గా సాంకేతిక లోపం ఉన్న‌ట్లు గుర్తించారు. హైద‌రాబాద్ కు వెళుతుండ‌గా లోపాన్ని గుర్తించారు పైల‌ట్. ఆ వెంట‌నే తిరిగి ఒంగోలుకు మళ్లించారు. అక్క‌డ సుర‌క్షితంగా బాల‌కృష్ణ ను దించారు(Balakrishna Landing). వెంట‌నే సాంకేతిక నిపుణుల‌ను హెలికాప్ట‌ర్ వ‌ద్ద‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం లోపాన్ని స‌వ‌రించే ప‌నిలో ప‌డ్డారు టెక్నీషియ‌న్స్.

ఇదిలా ఉండ‌గా ఓకే అయితే హెలికాప్ట‌ర్ లో వెళ‌తార‌ని లేక పోతే బాల‌కృష్ణ ర‌హదారి మార్గం ద్వారా హైద‌రాబాద్ కు చేరుకుంటార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే బాల‌కృష్ణ న‌టించిన వీర సింహారెడ్డి ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ , దునియా ఫేమ్ విజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వీరసింహా రెడ్డిని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి అభిమానుల‌కు. ఇక మ‌క‌ర పండ‌గ‌కు బాల‌కృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, త‌ళ‌ప‌తి విజ‌య్ వార‌సుడు విడుద‌ల కానున్నాయి.

ఈ సంద‌ర్భంగా సాంకేతిక లోపాన్ని ముంద‌స్తుగా గుర్తించినందుకు పైల‌ట్ ను అభినందించారు బాల‌య్య బాబు.

Also Read : బాల‌కృష్ణ స్పీచ్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!