Tejashwi Yadav: నీట్‌ పేపర్‌ లీకేజీ తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు !

నీట్‌ పేపర్‌ లీకేజీ తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు !

Tejashwi Yadav: దేశంలో సంచలనం రేపుతున్న నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో తేజస్వి వ్యక్తిగత సహాయకుడికి పరిచయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణపై… తేజస్వీ(Tejashwi Yadav) స్పందిస్తూ పేపర్‌ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్నారు.

‘‘ఈ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉంది. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలనుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పేపర్ లీక్‌కు అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నీతీష్ కుమార్‌లే’’ అని తేజస్వి(Tejashwi Yadav) ఆరోపించారు. ప్రధాన నిందితుడికి ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ కు సంబంధం ఉందని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీ నేతలు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రధాన నిందితుడు అమిత్‌ ఆనంద్‌ బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఉన్నారు. కేసులో ఆనంద్‌ పేరు బయటకు రాగానే అతడితో ఉన్న ఫొటోలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి డిలీట్‌ చేశారన్నారు. కానీ అవన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, వాటి ద్వారా అసలైన దోషులు ఎవరో తెలుస్తుందని పేర్కొన్నారు.

Tejashwi Yadav – నీట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం నిరాకరణ !

మరోవైపు నీట్‌ వ్యవహారంపై తాజాగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం… కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసేందుకు నిరాకరించింది. జులై మొదటి వారంలో నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానున్న సంగతి తెలిసిందే. నీట్‌ పరీక్ష వ్యవహారంపై దర్యాప్తు జరిపించడంతోపాటు ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్లపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారించింది. వీటిపై దాఖలైన పిటిషన్లను జులై 8 నుంచి విచారించనున్నందున… జులై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం… తాజాగా దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. వీటిని పెండింగ్‌ పిటిషన్లతో కలిపి జులై 8న విచారిస్తామని పేర్కొంది.

Also Read : Nagababu : తొలిసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడంపై కీలక ట్వీట్ చేసిన నాగబాబు

Leave A Reply

Your Email Id will not be published!