Telangana Bhavan: తెలంగాణ భవన్‌ కు వాస్తు మార్పులు !

తెలంగాణ భవన్‌ కు వాస్తు మార్పులు !

Telangana Bhavan: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ(Telangana) భవన్‌ కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీనితో వాస్తు నిపుణుల సలహాల మేరకు భవనంలో అవసరమైన మార్పులు… చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండగా… వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు.

Telangana Bhavan Modifications

రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపునకు మార్చడానికి ట్రాఫిక్‌ సమస్య కూడా కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీనితో తెలంగాణ భవన్‌ లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఒకటి, రెండు వాహనాలు కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు.. చేర్పులు చేస్తున్నారు.

Also Read : Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!