Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ.275891కోట్లు..ఏ శాఖకు ఎన్ని కోట్లు…

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు

Telangana Budget : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2024-25 తెలంగాణ(Telangana) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,75,891 కోట్లు అని తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు. సాధారణ ఖాతాలో శాఖాపరమైన బడ్జెట్ కేటాయింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Telangana Budget Updates

ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11692 కోట్లు, మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ.21389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, వైద్య రంగానికి రూ.11500 కోట్లు, విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2418కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు కేటాయించారు.

Also Read : Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఏడుగురు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!