Telangana Cabinet: త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?
త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?
Telangana Cabinet : మంత్రి వర్గ విస్తరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, ఒకరు రెడ్డి, ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది.
Telangana Cabinet Expansion
ఏఐసీసీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ కు… ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
Also Read : MMTS Rape Attempt: పోలీసుల అదుపులో ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసు నిందితుడు