CLP Meeting : హస్తినకు చేరిన సీఎం ఎంపిక
ఖర్గే నిర్ణయం కోసం నిరీక్షణ
CLP Meeting : హైదరాబాద్ – తెలంగాణలో భారీ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హైదరాబాద్ లో గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అయ్యారు. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ఈ మొత్తం వ్యవహారం అంతా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కనుసన్నలలో నడుస్తోంది.
CLP Meeting Updates
ప్రస్తుతం గచ్చిబౌలి లోని హోటల్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చివరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ప్రతిపాదన మేరకు ఎవరు సీఎం కావాలనే దానిపై కొన్ని పేర్లతో ఏఐసీసీకి పంపించారు.
ఈ విషయాన్ని పరిశీలకుడిగా ఉన్న డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎవరు సీఎల్పీ లీడర్ గా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటారని, రెండు గంటల్లో సమాచారం వస్తుందన్నారు.
సోమవారం రాత్రి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు డీకే శివకుమార్. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. మొత్తంగా రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి, ఉత్తమ్ , కోమటిరెడ్డి, రాజ నరసింహల మధ్య పోటీ నెలకొంది.
Also Read : Animal Movie Collections : యానిమల్ కలెక్షన్ల సునామీ