Telangana Congress : (Politics in Telangana) మరింత వేడెక్కాయి. ఇప్పటికే దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ముగిశాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన (Congress party) తన పట్టుకోల్పోయింది.
అధికారంలో ఉన్న పంజాబ్ ను వదులుకుంది. భారతీయ జనతా పార్టీ తన హవా కొనసాగించింది.
ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా క్యాడర్, నాయకత్వం కలిగిన (Congress party) పంజాబ్ లో మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
(Rewanth Reddy) కి(Telangana Congress) పీసీసీ పగ్గాలు ఇచ్చినప్పటి నుంచీ పార్టీలో మొదటి నుంచీ కొనసాగుతున్న సీనియర్లకు రేవంత్ వర్గానికి మధ్య పొసగడం లేదు.
పైకి జగ్గారెడ్డి ఒక్కడే బయట పడినా మిగతా నాయకులు మాత్రం లోలోపట రగిలి పోతున్నారు.
(Rewanth Reddy) ఎక్కడ ఉన్నా వన్ మ్యాన్ షో చేస్తూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడే తప్పా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండడం లేదంటూ ఆరోపించారు జగ్గన్న.
మన ఊరు మన పోరు పేరుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న (Rewanth Reddy) దుందుడుకు వ్యవహారం చర్చకు దారి తీసింది.
ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో గీతా రెడ్డి, వీహెచ్, పొన్నాల, జగ్గా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తదితరులు హాజరయ్యారు.
ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రేవంత్(Telangana Congress) తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
త్వరలోనే ఢిల్లీకి రేవంత్ వ్యతిరేక వర్గం వెళ్లాలని నిర్ణయించినట్లు టాక్. కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించం విశేషం.
దాదాపు మూడు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు,
రేవంత్ దూకుడు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్తు గురించి చర్చించినట్లు తెలిసింది.
పార్టీ బలోపేతం కోసమే చర్చించామన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగిందన్నారు శశిధర్ రెడ్డి.
ఇదిలా ఉండగా జగ్గన్న మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్నీ మీడియాకు చెప్పలేమన్నారు. మొత్తంగా పైకి విధేయుల ఫోరం అని చెప్పినా మొత్తం రేవంత్ పైనే ఫోకస్ పెట్టినట్లు టాక్.
Also Read : ముహూర్తం ఫిక్స్ రాహులే నెక్ట్స్