144 Section : ఓట్ల లెక్కింపు వద్ద 144 సెక్షన్
వెల్లడించిన సిఈవో వికాస్ రాజ్
144 Section : హైదరాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు సమయం ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలలో ప్రశాంతంగా ఓటు వేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు.
144 Section in Telangana Votes Counting area
ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నియమ నిబంధనలు పాటించాలేనని స్పష్టం చేశారు. ఎవరు అతిక్రమించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఆయా లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్(144 Section) అమలు చేస్తామన్నారు వికాస్ రాజ్.
తెలంగాణ రాష్ట్ర మంతటా రెడ్ అలర్ట్ ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రభుత్వంతో పాటు బరిలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని సూచించారు.
ఏ మాత్రం గీత దాటితే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు వికాస్ రాజ్. భద్రతకు సంబంధించి ప్రత్యేక పోలీసులు, నగర సాయుధ రిజర్వు దళాలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని తెలిపారు.
Also Read : CM KCR : గులాబీదే రాజ్యం నేనే సీఎం