KTR : ఆవిష్కరణలు..అంకురాలకు పెద్ద పీట
భవిష్యత్తులో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
KTR : నూతన ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికను మరింత అభివృద్ది చేసి విదేశాలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో 3డీ టెక్నాలజీ అవసరం మరింత ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఆయా దేశాలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు, 50కి పైగా స్టార్టప్ లు (అంకురాలు) , 15కు పైగా జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థలు , 3,000 మందికి పైగా నిపుణులు ఎక్స్ పోలో పాల్గొంటారని మంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో హైదరాబాద్ లో ఏరోస్పేస్ , డిఫెన్స్ , వైద్య పరికరాలు , మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ది సాగుతోందన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలలో నెంబర్ వన్ గా తెలంగాణ ఉందని అన్నారు కేటీఆర్(KTR). అంకురాలకు, కొత్తగా రూపొందించే ఆవిష్కరణలకు, నూతన పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి ప్రోత్సాహం లభిస్తోందని చెప్పారు.
దార్శనికత కలిగిస సీఎం కేసీఆర్ ఉండడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. సీఎం మద్దతుతో రాష్ట్రంలో టీహబ్ , టీఎస్ఐసీ, వీ హబ్ , టాస్క్ తదితర స్టార్టప్ లతో సాంకేతిక వ్యవస్థ అభివృద్ది చెందిందని తెలిపారు. స్కైరూట్ స్టార్టప్ సంస్థ ప్రైవేట్ రాకెట్ ను తయారు చేసి పేరు తెచ్చుకుందని గుర్తు చేశారు మంత్రి.
దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించడం ఇదే మొదటి సారి అని, ఇది తెలంగాణకు గర్వ కారణంగా నిలిచిందన్నారు కేటీఆర్.
Also Read : లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు