Telangana Govt orders : వాహనదారులకు షాక్.. మరికొన్ని గంటల్లో నిలిచిపోబోతున్నఈ చలాన్ ఆఫర్

తెలంగాణాలో భారీ మొత్తంలో వసూలైన ట్రాఫిక్ చలాన్లు

Telangana Govt orders: తెలంగాణ వాహనదారులకు బిగ్ వార్నింగ్..!పెండింగ్ లో ఉన్న పలు ట్రాఫిక్ చలాన్ లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. డిసెంబర్ 26న ప్రారంభించిన ఈ ఆఫర్ కి వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో 3.59 కోట్ల చలాన్లు బకాయిలు ఉండగా, నిన్నటి వరకు 14 లక్షల చలాన్లు కట్టినట్టు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెండింగ్ చలాన్ లు పూర్తయ్యాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పెండింగ్ లో ఉన్న చలాన్ లను ఈ రాత్రిలోగా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) వాహనదారులకు సూచించారు. ఎవరైనా బకాయి ఉన్న చలాన్‌ను చెల్లించకుంటే, వెంటనే చలాన్‌ను చెల్లించమని అడుగుతారు మరియు ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు.

Telangana Govt orders Viral

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సుల చలాన్ లు మరియు తోపుడు బల్లపై ఉన్నచలాన్ లు 90 శాతం, బైక్ లకు 80 శాతం, ఆటోలు మరియు కార్లపై 60 శాతం, ట్రక్కులు మరియు ఇతర భారీ వాహనాలపై 50 శాతం భారీ తగ్గింపును ప్రకటించారు. అయితే, డిసెంబర్ 25 తర్వాత చెల్లించే చలాన్‌లకు ఎటువంటి తగ్గింపు ఇవ్వబడదని ప్రభుత్వం తెలిపింది. ఈ తగ్గింపు ఆఫర్ గతంలో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

మీసేవా మరియు ఇతర UPI ద్వారా ఆన్‌లైన్‌లో ఈ చలాన్‌లను చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ కేవలం కొన్ని గంటల్లో ముగుస్తుంది కాబట్టి వాహనదారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. మీకు ఏవైనా బకాయిలు ఉంటే, వాటిని వెంటనే చెల్లించండి. మీరు ఈ ఆఫర్‌ను మిస్ అయితే, మీరు తర్వాత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. సో…జాగ్రత్త…!

Also Read : Kesineni Nani : టీడీపీని వీడిన కేశినేని.. వైసీపీ గూటికి వెళ్లనున్నారా..?

Leave A Reply

Your Email Id will not be published!