Telangana Govt : తెలంగాణలో 5 ఐపీఎస్ లు బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Telangana Govt : త్వరలో ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుంచే పాలనా పరంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 31 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. చాలా మందికి స్థాన చలనం కలిగింది. మరో వైపు రాష్ట్రంలో కీలకమైన పోస్టులలో ఉన్న సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Govt Decision
ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్(Telangana Govt). ఇక బదిలీ చేసిన ఐపీఎస్ ఆఫీసర్లలో పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యా మిశ్రా, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా కమల హాసన్ రెడ్డి, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ , హోమ్ గార్డ్స్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అంబారి కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా సభారీస్ ను నియమించింది.
వీరి నియమాక ఉత్తర్వులు వెంటనే అమలు లోకి వస్తాయని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మరికొందరికి స్థాన చలనం తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు కీలకమైన ఐపీఎస్ అధికారులను మార్చడం ప్రస్తుతం చర్చకు దారి తీసేలా చేసింది.
Also Read : Gadwal ZP Chairman : బీఆర్ఎస్ కు షాక్ సరిత రిజైన్