Telangana IPS Officers : హైదరాబాద్ కు కొత్త పోలీస్ బాస్ లు
సీఎం రేవంత్ రెడ్డి సైన్యం నియామకం
Telangana IPS Officers : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు తీరడంతో భారీ ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించడం షరా మామూలే. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి తన వేట మొదలు పెట్టారు. తనను ఇబ్బందికి గురి చేసిన పోలీస్ ఆఫీసర్లను లూప్ లైన్ కు పంపించారు. వారిలో స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. ఆయన కేసీఆర్ పార్టీకి కార్యకర్తగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Telangana IPS Officers Newly Appionted
మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఏకంగా హైదరాబాద్ నగరానికి కొత్త బాస్ లను నియమించారు . ఏకంగా ముగ్గురు పోలీస్ కమిషనర్లను మార్చడం విశేషం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాక నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని లూప్ లైన్ లో ఉంచారు. దీంతో రేవంత్ రెడ్డి వచ్చాక తనకు మంచి పోస్టు దక్కింది. ఇక హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది. సైబరాబాద్ , రాచకొండ సీపీలు చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తిని నియమించారు.
Also Read : EX MLA Jeevan Reddy : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్