Telangana Lok Sabha Elections: తెలంగాణలో లోక్‌ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !

తెలంగాణలో లోక్‌ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !

Telangana Lok Sabha:తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌ లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్‌ నగరంలో 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్‌రాజ్‌ చెప్పారు.

Telangana Lok Sabha:

రాష్ట్రంలోని 17 లోక్‌ సభ స్థానాలకు పోటీ చేస్తున్న నాలుగు ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే… వారిలో 34 మంది నేరచరితులేనని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ)’ తెలిపింది. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 12 మంది, బీజేపీలో 12, బీఆర్‌ఎస్‌ 9, మజ్లిస్‌ కు చెందిన ఒక అభ్యర్థిపై కేసులు ఉన్నాయి. వీరికి సంబంధించిన పలు వివరాలను ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

తెలంగాణా లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్న 525 మంది అభ్యర్ధుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు 24 మంది, గ్రాడ్యుయేట్లు 12 మంది ఉండగా.. గ్రాడ్యుయేషన్‌ కంటే తక్కువ విద్యార్హతలున్నవారు 16 మంది ఉన్నారు. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగినవారు కాంగ్రెస్‌ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 12 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది, మజ్లిస్‌ నుంచి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్‌ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇవ్వగా… బీజేపీ ఇద్దరు, బీఆర్‌ఎస్‌ ఇద్దరికి ఇచ్చాయి.

Also Read :-AP Elections 2024: ఏపీలో మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ !

Leave A Reply

Your Email Id will not be published!