Telangana Rythu Bandhu 2024: మూడు విడతల్లో రూ.17,933 కోట్ల రుణమాఫీ – తెలంగాణా ప్రభుత్వం

మూడు విడతల్లో రూ.17,933 కోట్ల రుణమాఫీ - తెలంగాణా ప్రభుత్వం

Telangana: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని రైతులకు అసలైన స్వరాజ్యం వచ్చిందని.. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని, సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే… వాటిని వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం తెలిపారు. 27 రోజుల్లోనే 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ(Telangana) చరిత్రలో ఇదే మొదటిసారని సీఎం కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్లను కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని తెలిపింది.

Telangana Rythu Bandhu 2024 Updates

‘‘జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. అదే నెల 18న మొదటి విడతగా రూ.లక్ష వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జులై 30న శాసనసభ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ అవుతాయి. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించనున్నట్లు రుణమాఫీ విధి విధానాల్లో ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది’’ అని సీఎం కార్యాలయం పేర్కొంది.

తెలంగాణ(Telangana)లో రూ.2 లక్షల లోపు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 22,37,848 మంది రైతుల ఖాతాల్లో రూ.17,933 కోట్లు జమ చేసింది. మొదటి విడత 11,50,193 మందికి సంబంధించి రూ.6,098.93 కోట్లను, రెండో విడతలో 6,40,823 మందికి సంబంధించి రూ.6,190.01 కోట్లను రుణ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మూడో విడతలో గురువారం సాయంత్రానికి రూ.5,644.24 కోట్లను 4,46,832 మంది రైతులకు విడుదల చేసింది.

రుణ మాఫీలో అగ్రస్థానంలో నల్గొండ

మూడో విడత రుణమాఫీలోనూ నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 35,501 మందికి రూ.442.87 కోట్లు మాఫీ అయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 342 మందికి రూ.4.21 కోట్లు మాఫీ అయ్యాయి.

Also Read : Election Commission : జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

Leave A Reply

Your Email Id will not be published!