Telangana SSC Results: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ! నిర్మల్ ఫస్ట్ ! వికారాబాద్ లాస్ట్ !
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ! నిర్మల్ ఫస్ట్ ! వికారాబాద్ లాస్ట్ !
Telangana SSC Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదవగా బాలికలు పై చేయి సాదించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు పాసయ్యారు. 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా… 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 3,927 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు చెప్పారు.
Telangana SSC Results:
పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్‌ను తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. జూన్ 3వ తేదీన ఈ సప్లిమెంటరీ అడ్వాన్సుడ్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే జూన్ 14వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయని స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు నేటి నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నానమని… మే 16లోపు ప్రధానోపాధ్యాయుల వద్ద ఫీజు చెల్లించవచ్చన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వద్ద ఈ ఫీజు చెల్లించవచ్చునని విద్యార్థులకు విద్యాశాఖ కమిషనర్ సూచించారు. ఫలితాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దన్నారు. ఈ పరీక్షల ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదన్నారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో అద్భుతాలు చేసినవారు ఎందరో ఉన్నారని చెప్పారు.
Also Read:-Amit Shah : షా డీప్ ఫేక్ వీడియోల ఇష్యూపై హైదరాబాద్ లో ఢిల్లీ ఖాకీలు సెర్చ్ ఆపరేషన్