Telangana Comment : తెలంగాణలో ‘కమలం’ కలకలం
ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం
Telangana Comment : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. సర్వేల పర్వం కొనసాగుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోసం పాకులాడుతున్నాయి.
వ్యూహాలు, ప్రతివ్యూహాలతో హోరెత్తిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేది తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి జరగబోయే ఎన్నికలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి(Telangana Comment).
ఎవరు గెలుస్తారనే దానిపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా ఆచరణలోకి వచ్చే సరికల్లా ఎవరి బలం ఏమిటనేది జనం కంటే పార్టీలకే బాగా తెలుసు.
ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) దూకుడు పెంచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న గులాబీ దళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది.
రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ పవర్ లోకి వచ్చేలా చేస్తాయని గులాబీ దళపతి కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారు. ఇంకో వైపు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా కొలువు తీరాక ఆ పార్టీ సీన్ మారింది.
ఒక్కసారిగా యూత్ తో పాటు అగ్రకుల సామాజిక వర్గం ఒక్కటయ్యేలా కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ ఎవరికి వారే ఆందోళనలు, నిరసనలు, ఆరోపణలు, విమర్శలు, బూతులతో హీట్ పుట్టిస్తున్నారు.
రాజకీయ మంట పెడుతున్నారు. పనిలో పనిగా వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నా ఆయా పార్టీలకు ధీటుగా రాలేని పరిస్థితి.సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉంది.
మరో వైపు హుజూరాబాద్, దుబ్బాక, నగర పాలిక ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. ఆ మేరకు ఎలాగైనా సరే
తెలంగాణలో కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ట్రబుల్ షూటర్ అమిత్ షా కృత నిశ్చయంతో ఉన్నారు.
ఆ మేరకు తెలివిగా పావులు కదుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు. దాని బాధ్యతను ఈటల రాజేందర్ కు అప్పగించారు.
తెలంగాణలో(Telangana Comment) మేధావిగా, సుదీర్ఘమైన నాయకుడిగా పేరొందిన దాసోజు శ్రవణ్ తో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి జై కొట్టారు.
ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కావడం విశేషం. మరికొందరు కూడా కమలం వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ కూడా బహిరంగంగా ప్రకటించారు.
బీజేపీ ఇప్పటికే రాష్ట్ర మంతటా సర్వే చేపట్టింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నట్లయితే పవర్ లోకి రావడం ఖాయమని అనుకుంటోంది.
ఆ దిశగా బీజేపీ స్టేట్ చీఫ్ ప్రజా సంగ్రామయాత్ర ప్లాన్ చేశారు. మూడో విడత నడుస్తోంది. ఈనెల 21 నుంచి బీజేపీ అన్ని నియోజకవర్గాలలో టూ వీలర్ ర్యాలీలు చేపట్టనున్నారు.
బలమైన అభ్యర్థులు లేని చోట ఆపరేషన్ ఆకర్ష్ కు ప్లాన్ చేస్తోంది బీజేపీ. కొంత మంది ప్రజా ప్రతినిధులు టచ్ లో ఉన్నట్లు ప్రకటించారు ఈటల. ఏది ఏమైనా కేంద్రంలో మోదీ త్రయం తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ కీలక పోరులో జనం ఎవరి వైపు ఉంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : 21న ముహూర్తానికి రెడీ