Telugu Mahasabhalu 2024 : స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు

అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు

Telugu Mahasabhalu : ప్రపంచ రెండవ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరం వేదికగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు తెలుగు వెలుగులు విరాజిల్లనున్నాయి. రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్త్రాబ్ధి నీరాజనంగా, నన్నయ భారత రచనకు వెయ్యేళ్ళు పూర్తయిన సంధర్బంగా వేడుకలు నిర్వహించారు.

Telugu Mahasabhalu in Rajamahendravaram

విశాఖ ‘శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర’ ‘తెలుగు మహాసభలను(Telugu Mahasabhalu)’ లాంఛనంగా ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, “ఆర్ ఎస్ ఎస్” జాతీయ కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు , ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిధులు, ఎన్నీ భాషలున్నా తెలుగు భాషకున్న గొప్పదనం ఆ మాధుర్యం దేనికీ లేదన్నారు. తెలుగులో గర్వించదగ్గా కవులూ, కావ్యాలూ పురాణాలు, ఇతిహాసానుభవాలు తెలుగువాళ్లు చేసినట్టు ఎవ్వరూ చేయలేదని గుర్తు చేసారు. తెలుగు భాష మాధుర్యం ప్రపంచమంతా తెలిసేలా ప్రతిఒక్కరూ కృషిచెయ్యాలని పిలుపునిచ్చారు ప్రముఖులు. ఇంకా ఈ తెలుగు మహాసభల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Also Read : TDP MP Kesineni Nani: చంద్రబాబుకు కేశినేని నాని షాక్ ! త్వరలో టీడిపీకి రాజీనామా ?

Leave A Reply

Your Email Id will not be published!