Temba Bavuma : పేసర్లను ఎదుర్కోవడం మాకు సరదా
సఫారీ టీమ్ కెప్టెన్ తెంబా బవూమా
Temba Bavuma : భారత్ లో పర్యటించే సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పనిలో పనిగా భారత క్రికెట్ జట్టులో తాజాగా ఎంపికైన జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను ప్రస్తావించాడు.
స్పీడ్ బౌలింగ్ తో ఐపీఎల్ లో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. భారత్ కు ఇలాంటి పేసర్ ఉండడం అస్సెట్ గా భావించక తప్పదన్నాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతుల్ని విసరడం మామూలు విషయం కాదన్నాడు.
ఓ వైపు మాలిక్ ను ప్రశంసిస్తూనే ఇంకో వైపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తెంబా బవుమా. అదేమిటంటే తమ జట్టులోని బ్యాటర్లకు పేసర్లను ఎదుర్కోవడం అలవాటేనని స్పష్టం చేశాడు.
ఒక రకంగా అలాంటి బౌలర్లతో ఆడుకోవడం తమకు సరదాగా అని చెప్పాడు. ఎందుకంటే తాము మొదటి నుంచీ పేసర్లతోనే సహవాసం చేస్తూ వచ్చామన్నాడు. తమ మైదానాలు కూడా పేసర్లకు అనుకూలంగా ఉంటాయని తెలిపాడు.
ఇదిలా ఉండగా సౌతాఫ్రికా జట్టు భారత్ తో టీ20 సీరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు మ్యాచ్ లు ఇండియాతో ఆడుతుంది. ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. టికెట్లు కూడా భారీగానే అమ్ముడు పోతున్నాయి.
ఇటీవలే ఐపీఎల్ ముగియడంతో మళ్లీ క్రికెట్ ఫీవర్ మొదలవుతోంది. కాగా తెంబా బవూమా(Temba Bavuma) మరో మాట కూడా అన్నాడు. అదేమిటంటే ప్రతి బంతిని ఎదుర్కోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందన్నాడు.
మాలిక్ భవిష్యత్తులో అంతర్జాతీయంగా రాణించాలని కోరాడు. కాగా తెంబా బవూమా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : గోల్స్ సూపర్ మెస్సీ అదుర్స్