Lashkar Bonalu : 13,14న జరగబోయే ‘లష్కర్ బోనాలకు’ అంగరంగ వైభవంగా ఆలయాలు
అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది...
Lashkar Bonalu : ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే బోనాల జాతరకు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయం కేంద్రంగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమ్మవారి జాతరకు ముందు భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
Lashkar Bonalu Updates
బోనాల (Bonalu) ఏర్పాట్లపై గురువారం మహాకాళి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, మహంకాళి ఏసీపీ సైదయ్య, ఇన్‌స్పెక్టర్ పరశురామ్‌లతోపాటు జాతర కమిటీ సభ్యులు, భక్తులు హాజరయ్యారు.
భక్తుల కోసం ప్రత్యేక లైన్లు:
బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక లైన్లు, సాధారణ భక్తుల కోసం మరో లైన్, వీటికి అదనంగా రెండు లైన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రతా పరంగా 2,500 మంది పోలీసు సిబ్బంది నియమించనున్నట్టు డీసీపీ తెలిపారు. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వైద్య సేవలూ సిద్ధం:
అత్యవసర వైద్యసహాయం కోసం నలుగు వైద్య బృందాలను సన్నద్ధంగా ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. జాతర రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య బాటా నుంచి ఆలయం వరకు శివసత్తులకు ప్రవేశాన్ని అనుమతించనున్నారు.
బంగారు బోనం సమర్పణ:
జాతర సందర్భంగా భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తురాలు నిషా క్రాంతి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రతి ఏడాది తరహాలో ఈసారి కూడా జాతర వేడుకలు వైభవంగా జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తుల తాకిడి దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏర్పాటును శ్రద్ధగా చేపడుతున్నట్లు వారు తెలిపారు.
Also Read : AP Govt Schools Meeting : ఈరోజు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్
