Vishwa Deenadayalan : రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి
విశ్వ దీన దయాళన్ మృతిపై సీఎం సంతాపం
Vishwa Deenadayalan : తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ (Vishwa Deenadayalan)రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడికి 18 ఏళ్ల వయసు. విశ్వ దీనదయాళన్ గౌహతి నుంచి షిల్లాంగ్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
అండర్ -19 జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కూడా. గౌహతి నుంచి షిల్లాంగ్ కు టాక్సీలో వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ) ధ్రువీకరించింది.
ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న 83వ సీనియర్ జాతీయ , అంతరాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ల కోసం విశ్వ దీనదయాళన్ ముగ్గురు సహచరులతో కలిసి గౌహతి నుంచి షిల్లాంగ్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
విశ్వతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు రమేష్ సంతోష్ కుమార్ , అబినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్ , కిషోర్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.
వారందరికీ చికిత్స చేస్తున్నామని, పరిస్థితి కంట్రోల్ లో ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా ఉమ్లీ చెక్ పోస్ట్ తర్వాత షాంగ్ బంగ్లా వద్ద టాక్సీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది అని టీటీఎఫ్ఐ తెలిపింది.
టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా విశ్వ కూడా చని పోయినట్లు ఇందిరాగాంధీ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
విశ్వ అనేక జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు గెలుపొందాడు. టెన్నిస్ ప్లేయర్ మృతికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు.
Also Read : గుజరాత్ జైత్రయాత్ర వెనుక అతడొక్కడే