TG Assembly : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..చెప్పులు చూపించుకున్న ఎమ్మెల్యేలు

నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్‌లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు...

TG Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(శుక్రవారం) ఆరో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానంపై బీఆర్ఎస్ నేతలు చర్చకు పట్టుబడుతున్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారంటూ నల్ల బ్యాడ్జీలతో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చారు. సభలో ఫార్ములా- ఈ అంశంపైన వెంటనే సభలో చర్చకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

TG Assembly Issues

నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్‌లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 420కాంగ్రెస్(Congress) ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివానాలు చేశారు.ఫార్ములా- ఈ పైన కేసు అక్రమం అంటూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు.దీంతో అసెంబ్లీ రణరంగంగా మారింది. సభలో తమకు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకున్నారు. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను 15 నిమిషాల పాటు అసెంబ్లీ స్పీకర్ వాయిదా వేశారు.

స్పీకర్‌పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్ల కట్ట విసిరారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పేపర్లు చింపి విసిరేశారు. స్పీకర్ పోడియం మెట్లపైకి హరీష్‌రావు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైనపుకు దూసుకురావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేయి చూపించి హెచ్చరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : Lagacherla Case : సర్కారుకు వ్యతిరేకంగా రైతుల నినాదాలు

Leave A Reply

Your Email Id will not be published!