TG Governor : దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలి

ఈ సమావేశంలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు...

TG Governor : యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా రాజేంద్రనగర్‌లోని కో ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీటీఐ)లో జరిగిన ‘కశ్మీరీ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం’ శనివారం ముగిసింది. ఈ సమావేశంలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను గొప్పగా నిలబెట్టడానికి యువనైపుణ్యం అవసరమన్నారు.

TG Governor Comment

ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం గా కశ్మీర్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కశ్మీర్‌ యువతలో అనేక శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయని, వాటిని దేశం కోసం ఉపయోగించాలని సూచించారు. ఆ దిశగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నెహ్రూ యువ కేంద్రాన్ని గవర్నర్‌ అభినందించారు. దేశంలో 15 రాష్ట్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర కో ఆర్డినేటర్‌ విజయరావు తెలిపారు.

Also Read : Minister Nara Lokesh : కార్యకర్త మృతిపై భావోద్వేగ ట్వీట్ చేసిన మంత్రి లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!