TG Govt : కొత్త రేషన్ కార్డులపై సర్కార్ శుభవార్త

అందులోనే రేషన్ కార్డులు ఉన్నవారు, లేనివారి వివరాలు ఉందని వివరిస్తున్నారు...

TG Govt : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మరో అప్‌డేట్ వచ్చింది. అస్సలు లేనివారికి కొత్త కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల పేర్లను చేర్చాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న అప్లికేషన్లన సర్కారు ఆమోదించింది. దీంతో దాదాపు 30 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనున్నట్లు తెలిసింది. కొత్తగా జారీ చేయునున్న కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి. తెలంగాణలో జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నారు. గతంలో ఉన్న పాత రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను కూడా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే డేటాను సేకరించిన అధికారులు కార్డుల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కొత్త రేషన్‌కార్డుకు సంబంధించిన డిజైన్‌ ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టే అవకాశముందని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.

TG Govt Updates

కొత్త కార్డుల జారీకి అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం తేదని అధికారులు చెబుతున్నారు మొన్నామధ్య జరిగిన సామాజిక, ఆర్థిక సర్వేలో పేదల డేటా ఉందని.. అందులోనే రేషన్ కార్డులు ఉన్నవారు, లేనివారి వివరాలు ఉందని వివరిస్తున్నారు. ఆ మేరకు అర్హుల లిస్ట్‌ను గ్రామ సభలు, బస్తీ సభల్లో పొందుపరచనున్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల మందికి రేషన్​ కార్డులున్నాయి. ఆ రేషన్ ​కార్డుల పరిధిలో 2.1 కోట్ల మంది ఉన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి 6 కేజీల బియ్యం అందుతుంది. ఇందులో కేంద్రం నుంచి 5 కిలోలు ఇస్తుండగా, రాష్ట్రం నుంచి 1 కిలో ఇస్తుంది.అన్నపూర్ణ స్కీమ్ ​కింద ఉన్నవారికి 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇస్తుండగా.. అంత్యోదయ కార్డులు ఉన్న 5.66 లక్షల మందికి కేంద్రం 35 కేజీల బియ్యం ఇస్తుంది.

Also Read : TPCC Chief Mahesh Kumar : మంత్రి వర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!