TG High Court-Advocate Death : తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ న్యాయవాది మృతి
హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు...
TG High Court : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రెప్పపాటులో ప్రాణం పోతుంది. – అప్పటిదాకా అందరితో సరదా ఉంటూ, కోర్టులో కేసు వాదిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కేసు వాదిస్తూనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ రావు మృతి చెందిన ఘటన తెలంగాణ హైకోర్టు(TG High Court)లో జరిగింది.
TG High Court-Advocate Death in the Court
తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 18) హైకోర్టు 21వ కోర్టు హాల్‌లో న్యాయమూర్తి ముందు ఓ కేసులో తన వాదనలు వినిపిస్తున్నారు వేణుగోపాల్ రావు అనే న్యాయవాది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. కేసు వాదిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, అక్కడే ఉన్న తోటి న్యాయవాదులు వెంటనే స్పందించి, హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయనను పరిశీలించించిన వైద్యులు.. వేణుగోపాల్ రావు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు.
ఈ హఠాత్తు పరిణామంతో తెలంగాణ హకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు షాక్ అయ్యారు. కేసు వాదిస్తూనే ప్రాణాలు కోల్పోయిన అడ్వకేట్ వేణుగోపాల్ రావు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే సంతాప సూచకంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపివేశారు న్యాయమూర్తులు. అన్ని కోర్టుల్లో విచారణలు ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. కాగా.. ఇటీవల గుండెపోటు.. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వృద్ధులకే కాదు నడివయస్కులకు, యువతతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. కూర్చొన్న చోటే కూర్చుకున్నట్టుగానే.. నిలబడి ఉంటే అక్కడే.. డ్యాన్స్ చేస్తూ చేస్తూనే.. ఇలా ఎక్కడివాళ్లు అక్కడే.. క్షణాల్లో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉండి.. ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
Also Read @ AP Cabinet Meeting : మరికొంచెం ముందు కు వెళ్లనున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్