TG High Court : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి విచారణను వాయిదా వేసిన కోర్టు

ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది...

TG High Court : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డి(Vijayasai Reddy)ని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది.

TG High Court Comment

ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఐసీఏఐ సవాల్ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావలని ఉల్లఘించారని విచారణకు అనుమతి ఇవ్వాలని ఐసీఏఐ పేర్కొంది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదని ఐసీఏఐ పేర్కొంది. ఒకే అంశంలో రెండు వేరు వేరు వ్యక్తుల పిటిషన్‌లను కలిపి లిస్ట్ చేయడంపై ఐసీఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను వేరుగా విచారణ చేయాలని కోర్టును ఐసీఏఐ కోరింది. దీనిపై విచారణ జరిపిని హైకోర్టు.. మరో పిటిషన్‌తో జత చేకుండా విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను విడిగా లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. తరుపరి విచారణ వచ్చే వారానికి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

Also Read : KTR Vs CM Revanth : కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటున్న సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!